Sunday, April 28, 2024

బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

బీజేపీ తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి న్యాయస్థానంలో ఊరట లభించింది. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టెన్త్ హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో.. బండి సంజయ్ బెయిల్‌ రద్దుపై తీర్పు వెలువడింది. బండి సంజయ్ బెయిల్ ను రద్దు చేయాలని ఏప్రిల్ 17న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇచ్చిన టైంలో పోలీసులు చేసిన సూచనలు బండి సంజయ్ ఉల్లంఘించారని, విచారణ‌కు సహకరించట్లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇరువైపు న్యాయవాదులు హన్మకొండ కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ని కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement