Monday, April 29, 2024

గడీల పాలనకు అంతం… బీజేపీకే పట్టం: బండి

తెలంగాణలో గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టంగట్టాలని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీకి భయపడి గడీల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. ఓయూ జేఏసీ విద్యార్థి సురేశ్ యాదవ్ ని ఈరోజు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై బండి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒక రాక్షసుడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులపై కేసీఆర్ డైరెక్షన్ లో టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని.. ఆయనపై దాడులు చేసే రోజు వస్తుందని బండి హెచ్చరించారు. మంచి చేయాలని చెబితే, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై బరితెగించి దాడులు జరుగుతుంటే కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందని సంజయ్ మండిపడ్డారు.

సురేశ్ యాదవ్ పై రెండో సారి దాడి జరిగిందని తెలిపారు. ప్రజలందరూ చూస్తుండగా 20 మంది గూండాలు దాడి చేశారని చెప్పారు. ఈ దాడిని కేసీఆర్ ఎందుకు ఖండించలేదని బండి ప్రశ్నించారు. సురేశ్ యాదవ్ పై దాడి చేసిన వారిపై సెక్షన్ 307 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సురేశ్ కుటుంబ సభ్యులను మాటలతో వేధించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను అప్పులపాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి రూపాయి కేటాయించలేదని విమర్శించారు. ప్రతి స్కీంకు కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement