Thursday, November 7, 2024

మంచిర్యాలలో ఘనంగా సమైక్యత దినోత్సవ వేడుకలు.. జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకి పూలమాలలు సమర్పించిన అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ బాడావత్ సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement