Friday, May 3, 2024

SIDDIPET: రోడ్డున ప‌డ్డ ఆటో కార్మికులు …. ఆదుకోవాల‌న్న హ‌రీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోకార్మికులను రోడ్డున పడేసిందని మండిపడ్డారు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు . ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే కానీ మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలన్నారు.

సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రభుత్వం మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోకార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. కొద్దిరోజులుగా ఆటోకార్మికులు నిసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటోకార్మికులను పట్టించుకుని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. వారి నెలకు 15వేల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.

లేదంటే ఆటోకార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఎదుర్కొన వలసని పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆటోవాలను, వారి కుటుంబాలను కూడా గుర్తించాలని అన్నారు. సంక్రాంతి పండుగ అయిన ఆటోవాలన జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందని అన్నారు. ఆటో కార్మికులు త‌న‌తో చెప్పుకుంటున్న బాధలు వర్ణనాతీతం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారి బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారు కానీ.. వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదని అన్నారు. ఆటోవాల బాధలను గుర్తించి ప్రభుత్వం వారికి సహాయం చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement