Saturday, March 2, 2024

Assembly – అన్యాయం చేసింది కెసిఆరే – బిజెపి

హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ట్రాప్‌లో కాంగ్రెస్ పడొద్దని సూచించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని ప్రభుత్వం ఎందుకు తీర్మానం చేసిందో ముఖ్యమంత్రి సభకు తెలిజేయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా బేసిన్‌లోని 15 ఔట్ లెట్ల నుండి ఏపీ నీటిని తరలించుకుపోతుంటే.. ఆపగలిగే శక్తి మనకు లేనప్పుడు కేఆర్ఎంబీ ఎంటర్ కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement