Tuesday, October 8, 2024

AP: పార్థీ గ్యాంగ్ అరెస్ట్… భారీగా రికవరీ…

అనంతపురం, ఫిబ్రవరి 12, ప్రభ న్యూస్ బ్యూరో : పార్థీ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ముఠాలు దోపిడీ వ్యవహారాల్లో పేరెన్నికన్నవి ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పార్థీ గ్యాంగ్ గడగడలాడించే ముఠాను అనంతపురం పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. క్రైమ్ కంట్రోల్ సిఐ ఇస్మాయిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి ఈ ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్నారు.

పెట్రోల్ బంకులు, ఇల్లు, బ్యాంకులు ఇలా ఎటువంటి వాటిలోనైనా చాకచక్యంగా దోపిడీ చేసే నిష్ణాతులు. ఐదు మంది సభ్యులు, ముగ్గురు రిసీవర్లను కలుపుకొని 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిందితుల అరెస్టుకు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.


- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement