Tuesday, April 30, 2024

ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ బిడ్డ‌ అన్వితా రెడ్డి..

అమరావతి,ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి(24) ఈనెల 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజంగా పేరు గాంచిన అన్విత గ్రూప్‌ అనితర సాధ్యమైన ఈ సాహస యాత్రకు అవసరమైన శిక్షణకు అర్ధిక సహకారాన్ని అందించింది. అన్విత గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచ్యుతరావు బొప్పన ఈ గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన సహకారాన్ని అందించారని ఈ సందర్భంగా అన్విత రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ట్రాన్స్‌సెండ్‌ అడ్వెంచర్స్‌ నిర్వహి స్తున్న హిమాలయాల స్ప్రింగ్ క్లైబింగ్‌ సీజన్‌లో ఇంటర్నేషనల్‌ మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎక్స్‌పెడిషన్‌ టీమ్‌లో అన్విత భాగస్వామిగా ఈ రికార్డును సాధించారు. 1997లో జన్మించిన అన్విత రెడ్డి అతి సామాన్యమైన వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. తల్లి దండ్రులు పడమటి మధుసూధన్‌ రెడ్డి , చంద్రకళ. తల్లి అక్కడి అంగన్‌వాడీ పాఠశాలలో పనిచేస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement