Thursday, May 2, 2024

రైతుబంధు’ నమోదుకు మళ్ళీ అవకాశం.. ఈ నెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో రైతు బీమా పథకానికి ఈనెల 10 నుంచి నమోదు ప్రక్రియ మళ్ళీ ప్రారంభం కానుంది. కొత్తగా అర్హులైన రైతులను ఈ పథకంలో చేర్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరికీ బీమా పథకంలో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 5 వరకు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. జూన్‌ 18 వరకు పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు మాత్రమే అర్హులని అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ‘రైతుబంధు’ పంట పెట్టుబడి పథకం నిధులను కేసీఆర్‌ సర్కార్‌ విడుదల చేసిన సగంతి తెలిసిందే. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 10 నుంచి రైతు బీమా పథకానికి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement