Monday, April 29, 2024

Breaking: పీజీ యాజమాన్య కోటా సీట్లభర్తీకి మరో నోటిఫికేషన్.. మే 1న వెబ్ ఆప్షన్లు

వరంగల్, ప్రభ న్యూస్ ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్యకోటా సీట్లభర్తీకి వరంగల్ లో ని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అడిషనల్ మాప్ ఆఫ్ విడత కౌన్సెలింగ్ త‌ర్వాత‌ ఖాళీగా ఉన్న పీజీ యాజమాన్యకోటా సీట్ల భర్తీకి యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ జారీచేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన విద్యార్థులు మే 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 3 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయిన, చేరి డిస్ కంటిన్యూ చేసినా, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పేర్కొంది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement