Sunday, April 28, 2024

Jayasudha: బీజేపీలో మ‌రో హిట్ వికెట్‌…జ‌య‌సుధ పార్టీకి గుడ్‌బై

సినీ నటి జయసుధ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు.

గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నంచి పోటీ చేయాలని భావించి, టిక్కెట్ కోసం యత్నించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మేకల సారంగపాణికి టిక్కెట్ కేటాయించింది. కాంగ్రెస్ అధినేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగగా.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ గెలవలేకపోయారు. జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించిన జయసుధకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement