Sunday, May 5, 2024

Crime: చిన్నవాల్గొట్లో మరో సారి కత్తి పోట్ల కలకలం

సిరికొండ, డిసెంబర్ 23 ( ప్రభ న్యూస్ ): సిరికొండ పోలీస్టేషన్ పరిధిలోని చిన్నవాల్గొట్ గ్రామంలో మరో సారి కత్తి పోట్ల కలకలంతో గ్రామంలో అలజడి నెలకొంది. రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామానికి చెందిన పిట్ల రాములు గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్నవాల్గొట్ గ్రామానికి బ్రతుకు దేరువు కోసం వలస వచ్చి బర్ల కాపరిగా కొన్ని రోజులు జీవనం సాగిస్తున్నాడు.

బర్ల కాపరి వృత్తి వదిలేసి కూలీ పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ తరుణంలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో మేడకాయ వద్ద తీవ్ర గాయమై రాములు శనివారం తెల్లవారు జామున గం.3 ప్రాంతంలో అయన నివాసముంటున్న ఇంటి ముందర స్పృహ తప్పి పడిపోయాడు. ఆకొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చిన రాములు భార్య ఆపస్మారక స్థితిలో ఉన్న భర్తను కూతురు సహాయంతో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement