Friday, April 26, 2024

ఊరూరా ఉత్సవాలు.. దశాబ్దికి సర్వం సన్నద్ధం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నద్ధమైంది.. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారధ్యంలో నేటి నుంచి 21 రోజుల పాటు అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదేళ్ల తెలంగాణ ప్రయాణాన్ని అప్రతిహతంగా ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దశాబ్ది ఉత్సవాల సంబ్రంభం జిల్లాలో ఆరంభమైంది.. తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింప జేసే విధంగా నాడు -నేడు కార్యక్రమాల తో 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ప్రభుత్వం నుండి అందిన దిశ నిర్ధేశానికి అనుగుణంగా అధికారుల స్థాయిలో ఏర్పట్లు శరవేగంగా అందుకున్నాయి..నేటి నుంచి ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో చేపట్టనున్న కార్యక్రమాలతో జిల్లా అధికార యంత్రాంగం భారీ కసరత్తు చేపట్టి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు, సమాలోచనలు ఇప్పటికే జరిగాయి.. మంత్రి జగదీష్ రెడ్డి , ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్ని జిల్లాలకు ధీటుగా రాష్ట్ర స్థాయిలో ఉత్సవ నిర్వహణలో ముందుండి తిరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు..

అన్ని శాఖలకు దిశ -నిర్ధేశం.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో అన్ని శాఖలు సమన్వయం తో పని చేయనున్నాయి. ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి దిశ – నిర్ధేశం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు శాఖల వారిగా ప్రజలకు వివరిస్తూ, ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యులను చేయనున్నారు. అన్ని శాఖల అధికారులు చేయాల్సిన పనులు, విధులను వివరించారు.

- Advertisement -

దశాబ్ది ఉత్సవాల రోజు వారి కార్యక్రమాలు

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో నిర్వహించే రోజు వారి కార్యక్రమాల ను విడుదల చేసారు. నేడు అవతరణోత్సవ వేడుకలు, 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షాదినోత్సవం, 5న విద్యుత్తు విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరోగ్యం, 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీటి పండుగ, 19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించ నున్నారు

ముస్తాబైన జిల్లా కలెక్టర్ కార్యాలయాలు

దశాబ్ది ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముస్తాబయ్యాయి..రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర అవతరణ వేడుకల్లో జాతీయ జెండాలను అవిష్కరించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో నల్గొండ లో శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, యాదాద్రి లో ప్రభుత్వ విఫ్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి లు జెండాలను అవిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement