Thursday, July 25, 2024

TG | టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం..

తెలంగాణలో జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్ట‌ర్ కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 51,237 మంది హాజరుకానున్నారని.. ఇందులో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నట్లు తెలిపారు.

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 170 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్‌లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించామని, వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు. అయితే రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. సప్లిమెంటరీ పరీక్ష కోసం, ఒకటి నుండి మూడు సబ్జెక్టులకు దరఖాస్తుదారులు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి.

పదోతరగతి అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూలు ఇలా..

  • జూన్ 3న: తెలుగు, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్‌ కోర్సు-1, కాంపోజిట్‌ కోర్సు-2 పరీక్షలు
  • జూన్ 5న: సెకండ్ లాంగ్వేజ్
  • జూన్ 6న: ఇంగ్లిష్
  • జూన్ 7న: మ్యాథమెటిక్స్
  • జూన్ 8న: భౌతికశాస్త్రం (ఫిజికల్ సైన్స్)
  • జూన్ 10న: జీవశాస్త్రం (బయాలజీ)
  • జూన్ 11న: సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్)
  • జూన్ 12న: ఓఎస్‌ఎస్‌సీ (ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-1,
  • జూన్ 13న: ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్‌) పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.
Advertisement

తాజా వార్తలు

Advertisement