Friday, May 3, 2024

Story : కెనాల్ నీళ్లు తెగ తోడేస్తున్నారు !

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం నుండి బోధన్ పట్టణానికి నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 161కి భైంసా పట్టణంలో గల కెనాల్ నీటిని గత కొన్ని రోజులుగా వాడుతున్నారు. ఇది చూసిన జనం కెనాల్ లోని నీరు పంటలకి వాడాల్సి ఉండగా అనుమతి లేకుండా తోడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి రోడ్లకు నీరు వాడుతున్నారని ప్రశ్నించగా సంబంధిత అధికారుల నుండి పర్మిషన్ తీసుకున్నామంటూ అక్కడ పని చేసే సిబ్బంది బుకాయిస్తున్నారు. ఈ విషయంపై బైంసా ఏఈ శ్రీకాంత్, బైంసా మండల ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా బిబి 161 రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం నీళ్లు తోడడానికి మా వద్ద ఎవరూ, ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని తెలిపారు. రైతుల ప్రయోజనార్థం ఆ నీటిని వదిలినట్టు పేర్కొన్నారు. కాగా రోడ్డు నిర్మాణ పనుల ఇన్ చార్జిని ఇదే విషయమై అడుగగా నీటిని తీసుకెళ్లి మేము ఏమన్నా అమ్ముకుంటున్నామా అని వ్యంగంగా సమాధానం ఇచ్చారు. ఏదిఏమైనా కెనాల్ నీటిని తోడుకోవడం పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement