Sunday, May 5, 2024

TS : తపాలా శాఖ ద్వారా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలి యోజన ఎంపిక

కాగజ్ నగర్, ఫిబ్రవరి 29(ప్ర‌భ‌న్యూస్‌): ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజలీ యోజన లబ్దిదారుల ఎంపిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖకు అప్పగించిందని సిర్పూర్ కాగజ్ నగర్ సబ్ డివిజన్ తపాలా శాఖ అధికారి సిరికొండ సతీష్ తెలిపారు. ఈ స్కీంతో దేశవ్యాప్తంగా ఇళ్లకు సోలార్ రూఫ్ ప్లాంట్లను 40 శాతం సబ్సిడీతో నిర్మించి ఇచ్చి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా సౌర విద్యు త్తును అందించడమే ఈ పథక ఉద్దేశమన్నారు.

ఈ పథకం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.75 వేల కోట్ల విద్యుత్‌ ఖర్చు ఆదా అవుతుందని, తపాలా శాఖ సిబ్బంది సహకారంతో ఈ పథకంలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయిందన్నారు. ప్రజలు ప్రస్తుత తమ విద్యుత్తు బిల్లు,చరవాణి నెంబర్ తదితర వివరాలను తపాలా సిబ్బందికి అందిస్తే ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. పథకానికి అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement