Monday, April 29, 2024

AP : నారా లోకేశ్‍ను కలిసిన జలీల్ ఖాన్…

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెదేపా టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఇటీవల జలీల్ ఖాన్ పార్టీ మారతాడు అంటూ విస్తృత ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఆయన వైసీపీ ఎంపీ అయోధ్య రామ రెడ్డిని కలవడం కూడా హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేసినేని శివనాద్ జలీల్ ఖాన్ ను ప్రత్యేకంగా కలిసి పార్టీలో కొనసాగే విధంగా ఆయనను ఒప్పించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని గురువారం జలీల్ ఖాన్ ను వెంటబెట్టుకుని లోకేష్ దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ టిడిపిలో ఉంటానని లోకేష్ కు స్పష్టమైన హామీ ఇచ్చారు. తన భవిష్యత్తు కు బాధ్యత నాది అని జలీల్ ఖాన్ కి కూడా నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ముస్లింల మద్దతు కూడగట్టి తన వంతు పార్టీ విజయానికి కృషి చేస్తానని జలీల్ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement