Monday, July 22, 2024

ADB : అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళ్ల‌ర్పించిన ఎమ్మెల్యే పాల్వాయి

బెజ్జూర్, ఏప్రిల్ 14 (ప్రభ న్యూస) : డా.బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల విగ్రహానికి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ పరిధి కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం కాదని, భారతదేశం యొక్క ఆత్మ మనకు అంబేద్కర్ లో కనిపిస్తుందని, ప్రపంచం మొత్తం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గొప్పగా కొనియాడుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement