Tuesday, April 16, 2024

TS: మోడీ బహిరంగ సభకు భారీ జన సమీకరణ

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 4న ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తొలిసారిగా మోడీ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ నుండి బేల వరకు రూ.360 కోట్ల అంచనా వ్యయంతో అంతరాష్ట్ర రహదారి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

అంతేగాక రామగుండం థర్మల్ పవర్ యూనిట్ పనులకు వర్చువల్ ద్వారా ప్రధాని శ్రీకారం చుట్టనున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆంధ్రప్రభకు తెలిపారు. ఆదిలాబాద్ డైట్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని జన సమీకరణ ఏర్పాట్ల కోసం గురువారం ఆదిలాబాద్ లో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటన కమలం శ్రేణుల్లో జోష్ నింపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement