Sunday, June 16, 2024

కుష్టు వ్యాధి వ్యాలిడేషన్‌ బృందం పర్యటన..

బెల్లంపల్లి : కుష్టు వ్యాధి నివారణలో భాగంగా కుష్టు వ్యాధి వ్యాలిడేషన్‌ బృందం సభ్యులు తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కుష్టు వ్యాధికి సంబంధించిన రికార్డులను, వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. సర్వే బృందం పిహెచ్‌సీ సిబ్బందితో సర్వే నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వర చారి, ఏపిఎంఓ రాములు, శ్రీనివాస్‌ రెడ్డి, లోకేందర్‌, జిల్లా బృందం సభ్యులు డాక్టర్‌ సుబ్బారావు, డీపీఎంఓ రమేష్‌, పిహెచ్‌సీ డాక్టర్‌ ఝాన్సీరాణి, పిహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement