Friday, May 10, 2024

Indravelli – పదేళ్లలో కేసీఆర్‌ చేయలేనిది, తాము 2 నెలల్లో ఎలా చేస్తాం – రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లి – పీసీసీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో జరిగిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అందిన కాడికి దోచుకుని..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మిగిల్చిందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసిందని, మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దోపిడి పాలన కారణంగా, పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని అన్నారు సీఎం రేవంత్. పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదని విమర్శించారు. 1981 ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పానని, ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. చెప్పిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారని అన్నారు.

జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేశారని, ఆ స్ఫూర్తితోనే తాము పని చేస్తామన్నారు. ఇంద్రవెల్లి గాలి, నీటిలో పౌరుషం ఉందని అన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరి చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో ఆలోచన చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదని, తాము 2 నెలల్లో ఎలా చేస్తాంమని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు..

త్వరలోనే లక్ష మంది అడబిడ్డలకు రూ.500కే సిలెండర్ ఇచ్చే పథకం ప్రారంభిస్తామని చెప్పారు.త్వరలోనే తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకా లక్ష 93 వేల ఉద్యోగల భర్తీ చేసే బాధ్యత తమదని అన్నారు. ఆదిలాబాద్ మట్టికి గొప్పతనం ఉందని.. రంజీ గోండు, కొమురం భీంల ప్రస్తావన లేకుండా చరిత్రనే లేదని అన్నారు.

- Advertisement -

మాట ఇచ్చిన ప్రకారం అమరుల సాక్షిగా అభివృద్ధికి శ్రీకారం చుడుతామన్నారు. ఆదిలాబాద్‌ను దత్తతకు తీసుకుని.. అభివృద్ధి పయనంలో నడిపిస్తామని తెలిపారు. ఇంద్రవెల్లి అమరులకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆదిలాబాద్ జిల్లా సంక్షేమానికి ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు.ప్రగతి భవన్ వద్ద ఎండలో ఎదురుచూసిన గద్దర్ ఉసురు బీఆర్ఎస్‌కి తగిలిందని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారని, ఊర్లకి వచ్చి ఎవరైనా ఆ మాట అంటే తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇకపై ఈ రాష్ట్రానికి సీఎం కాదు కదా.. మంత్రి కూడా కాలేరని చెప్పారు. దేశంలో పేదల ప్రభుత్వం రావాలంటే.. మోదీని గద్దె దించల్సిందేనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement