Friday, June 7, 2024

TS : చెన్నూరులో చేప‌ల కోసం… డిష్యూం… డిష్యూం…

చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని పెద్దచెరువు చేపలవేట వివాదం రోజురోజు కు ముదిరాజ్, గంగపుత్రుల కులాల మధ్యచిచ్చు రేపుతుంది. ఇవాళ ఉదయం స్థానిక పెద్ద చెరువులో తమ వాటా ఖరారు కాకుండానే గంగపుత్రులు చేపలవేట కొనసాగిస్తున్నారని ముదిరాజ్ మత్స్యకార సభ్యులు చెరువు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపచేశారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే చెన్నూరు పెద్ద చెరువులో గంగాపుత్రులు ముదిరాజ్ కులస్తులు ఉమ్మడిగా చేపల వేట కొనసాగిస్తూ ఉండేవారు కాలక్రమేణా గత కొన్ని సంవత్సరాలుగా ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తి అధికారులను, పోలీసులను ఆశ్రయిస్తున్నా, ప్రతి ఏడాది ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తూనే ఉన్నాయి. గత 16సంవత్సరాల క్రితం ఇరు వర్గాల పెద్ద మనష్యులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయినప్పటికీ గంగపుత్ర వర్గానికి చెందిన పలువురు నాయకులు తమ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ తమకు చేపల వేటలో ఎలాంటి వాటా కల్పించకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి జాలర్లను తీసుకువచ్చి చేపల వేట కొనసాగిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని గత సోమవారం చెరువు వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారికి న్యాయం కోరుతూ ముదిరాజ్ కులస్తులు వినతి పత్రం అందజేశారు.

అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తిరిగి ఈ రోజు గంగపుత్రులు చేపలవేట చేపడుతుండడంతో ఇరువర్గాల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇంత జరుగుతున్నా సంబంధిత మత్స్యశాఖ అధికారులు ఇరువర్గాల‌ మధ్య సయోధ్య కుదుర్చక పోవడం పట్ల అధికారుల ఆంతర్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మత్స్యశాఖ అధికారులు పోలీసు అధికారులు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement