Wednesday, May 1, 2024

పర్యావరణ పరిరక్షణకు అందరి సహకారం అవసరం : ట్రైనీ కలెక్టర్ శ్రీ‌జ‌

ఇచ్చోడ, 7 (ప్రభ న్యూస్): ముల్తానీలలో పరివర్తన ఎవరో చెప్తే రాదని, పరివర్తన మీలో మీరే పరివర్తన చెందాలని ట్రైనీ కలెక్టర్ శ్రీజ అన్నారు. బుధవారం మండలంలోని గుండాల గ్రామ ముల్తానులతో ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముల్తానీలు అంటే కల్ప స్మగ్లర్లుగా పేరు పడ్డారని, గ్రామంలో కొందరి వలన గ్రామానికి మొత్తం చెడ్డపేరు వస్తుందని, మీలో మీరు పరివర్తన చెంది కల‌ప అక్రమ రవాణాకు పాల్పడే వారిని మార్చాల్సిన అవసరం ఉంద‌న్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భావితరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించ‌గ‌ల‌మ‌ని.. మీలో మార్పు రావాలని అన్నారు. అనంతరం సిరిచేల్మా బేస్ క్యాంపు భవనంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. ఆమె వెంట సిరిచేల్మా అటవీశాఖ అధికారి వాహబ్ అహ్మద్, ఎఫ్ ఎస్ ఓ అమర్ సింగ్ తో పాటు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

డంపింగ్ యార్డ్ చుట్టూ బౌడ్రీ స్ట్రెంజ్ ఏర్పాటు చేసుకోండి
ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్ చుట్టూ బౌడ్రీ స్ట్రెంజ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు చుట్టూ కంచ ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా చెత్తాచెదారం పంట చేనులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె డంపింగ్ యార్డ్ పరిసరాలను పరిశీలించి సర్పంచ్ తో పాటు అధికారులకు పలు సూచనలను చేశారు. ఆమె వెంట సర్పంచ్ చౌహన్ సునీత, పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement