Sunday, April 28, 2024

ADB : అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలిః ఎమ్మెల్యే ఏలేటి

నిర్మల్ ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రభ న్యూస్): ప్రపంచానికి మార్గదర్శనం చేసిన వ్యక్తిగా ఆయన మార్గంలో నడవాలని బిజెఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ల‌ర్పించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, ఆదిలాబాద్ పార్లమెంటు కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మే రాజు, శ్రీగాడే విలాస్, కుమ్మరి వెంకటేష్,చరణ్ మౌర్య, సంతోష్,జుట్టు రమేష్, మహేష్, లింగన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement