Sunday, April 28, 2024

National : బీజేపీ మేనిఫెస్టో…. పోల్ పిచ్ః కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున్ ఖర్గే

సంకల్ప్ పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. బీజేపీ మేనిఫెస్టో పోల్ పిచ్ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ఎంఎస్పీ పెంచుతానని, లీగల్ గ్యారంటీ ఇస్తానని హామీ ఇచ్చారు.. అవి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.

- Advertisement -

మోదీ హయాంలో దేశ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని విమర్శించారు. యువత ఉద్యోగాలు లేక వీధిన పడుతున్నారు.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. వీటి గురించి ప్రధాని మోదీ ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుకు నమ్మశక్యం కానీ హామీలతో కొత్త మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు.. బీజేపీ మేనిఫెస్టో అంత నమ్మదగినది కాదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ నేత , ఢిల్లీ మంత్రి అతిషి స్పందించారు. బీజేపీ పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి సంవత్సరం 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని.. దేశ చరిత్రలోనే ఇది అత్యధికం అని అన్నారు. దేశం మొత్తం మీద ఆయుష్మాన్ భారత్ కోసం ఖర్చు చేసిన ఆరోగ్య బడ్జెట్ కంటే తక్కువ అన్నారు.

ఢిల్లీలో ఆరోగ్య బడ్జెట్ లో 9వేల కోట్లు కేటాయిస్తే.. దేశం మొత్తం మీద ఆయుష్మాన్ భారత్ కు కేవలం రూ. 80వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని ఆరోపించారు. నేను పనిచేయలేదని మీరు అనుకుంటే అరవింద కేజ్రీవాల్ కు ఓటువేయొద్ద అని చెప్ప ధైర్యం కేజ్రీవాల్ కు ఉంది. అదే ప్రధాన మోదీకి ఉందా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement