Friday, May 17, 2024

వాహనదారుల నిబంధనలు..

భీమిని : వాహనదారులు నిబంధనలు పాటిస్తూ తమ వాహనాలను భద్రంగా నడుపిస్తూ సురక్షితంగా ఇండ్లకు చేరాలని భీమిని ఎస్ ఐ అసరి కొమురయ్య అన్నారు. భీమిని మండల పరిషత్‌ కార్యాలయం ముందు శిక్షణ ఎస్ ఐ. ఎస్ .డీ.మాలిక్‌, భాస్కరచార్యులు వాహనాలను తనిఖీ చేసి వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులతో పాటు ఆటోలు తదితర భారీ వాహన చోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా లైసెన్స్‌, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌, తదితర దృవీకరణ పత్రాలు కల్గి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు పేపర్లతో పాటు హెల్మెట్‌ను దరించి వాహనాలను నడుపాలని, మారిన నిబంధనల ప్రకారం ఏ ఒక్కటి లేకున్నా భారీ జరిమానా కట్టాల్సివస్తుందని, అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాధాలకు కారకులు కావద్దని, ఈ విషయంలో పోలీసులకు సహకరిస్తూ సురక్షితంగా వాహన చోదకులు ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. పలువురు వాహనదారులకు జరిమానాలను విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement