Monday, April 29, 2024

Adialabad – గజరాజు.. గ‌జ‌గ‌జ – గ్రామాలలో భయం భయం ..

ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రభ న్యూస్) బ్యూరో : కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో గ‌జ‌రాజు అలజడి సృష్టిస్తోంది. రెండు రోజులుగా పెంచికల్పేట్ బెజ్జూర్ , సిర్పూర్ టీ, చింతల మానేపల్లి మండలాల్లో ఏనుగు తిరుగుతుండ‌టంతో జ‌నం భ‌యాందోళ‌కు గుర‌వుతున్నారు. గురువారం రాత్రి కొండపల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వ‌చ్చింది. దీంతో డ్రైవర్ బస్సును అక్కడే కొద్దిసేపు ఆపారు. ప్రయాణికులు ఏనుగు ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ల‌లో బంధించారు. 60 మంది ట్రాకింగ్ టీం, మూడు డ్రోన్ కెమెరాలతో ఏనుగు ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రకృతి వనంలో బీభత్సం
పెంచికల్పేట్ మండలం కమ్మర్గాం సమీపంలో శుక్ర‌వారం ఉదయం గ‌జ‌రాజు బీభత్సం సృష్టించింది. వరి పొలంలో ఆహారం తిన పల్లె ప్రకృతి వనాన్ని చిందరవందర చేసింది. ఏనుగు క‌నిపిస్తే రెచ్చగొట్ట వద్దని, అరుపులు కేకలతో బెదిరించవద్దని సీఎఫ్ఓ శాంతారామ్ తెలిపారు. అలా చేస్తే ఏనుగు ద్వారా ప్రాణ హాని క‌లిగి అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ప్రాణహితకు చేరువ‌లో..
ప్రాణహిత నదికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని మొర్రిగూడ వద్ద ఏనుగు సంచరిస్తోంది. శుక్ర‌వారం మధ్యాహ్నం ప్రాణ‌హిత తీరం వైపు అడుగులు వేస్తూ గ్రామస్తులకు కనిపించింది. 4 కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడను కనిపెట్టే స్వభావం కలిగిన ఏనుగు.. 2 కిలోమీటర్ల దూరం నుంచి మనిషి కదలికలను పసిగట్టడం గమనార్హం . రోజుకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల ఆహారం, సగటున రోజుకు 125 లీటర్ల నీటిని సేవించడం దాని దిన చర్య. దారి తప్పి వచ్చిన ఏనుగు ఈరోజు రాత్రి వరకు ప్రాణిహిత తీరం దాటి మహారాష్ట్రకు వెళ్తుంద‌ని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అట‌వీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement