Tuesday, October 3, 2023

Accident – బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొని అనంతరం హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకువచ్చింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్‌-3లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొనడంతో సెక్యూరిటీ గార్డ్‌తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement