Sunday, May 5, 2024

Breaking: ఆటోలపై కూలిన చెట్టు… డ్రైవర్ మృతి

హైదరాబాద్ : ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదర్‌గూడ ఓల్డ్‌ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్ప కూలింది. సిగ్నల్‌ వద్ద నిలిచిన రెండు ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటో డ్రైవర్‌ మృతి చెందారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ కాసేపు నిలిచిపోయింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement