Thursday, May 2, 2024

హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ

హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఏకంగా బోర్డు తిప్పేసింది. కంపెనీలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగులను రోడ్డున వేసింది. ఉద్యోగం అయితే పోయింది అనుకోవటానికి వీల్లేని సిట్యువేషన్ ఇక్కడ.. ఎందుకంటే ఉద్యోగుల పేరుతో కంపెనీ అప్పులు తీసుకోవటం మరో ట్విస్ట్. కంపెనీ ఎత్తేయటంతో.. ఉద్యోగులే ఆ అప్పులు చెల్లించాల్సిన దుస్థితి. చిత్ర, విచిత్రంగా సాగిన ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ బాగోతం సంచలనంగా మారింది. గచ్చిబౌలిలోని ఇన్ఫోసి కంపెనీ నిర్వాకం బయట పడటంతో.. ఈరోజు ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు ఉద్యోగులు.

20 నెలలుగా జీతాలు చెల్లించకపోగా.. ఇప్పుడు ఏకంగా కంపెనీ మూసివేయటం ఏంటని నిలదీశారు. ఉద్యోగులను టెర్మినేట్​ చేస్తూ కంపెనీ ఈ మెయిల్స్​ పంపిందని.. అయితే 650 మంది పేరున ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయిలు, 50 మంది ఉద్యోగుల పేరుతో ఒక్కొక్కరి పేరుపై 10 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం లోన్​ తీసుకుందని.. ఇప్పుడు మేం వాటిని ఎలా చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగుల పేరుతో తీసుకున్న అప్పులు ఎవరు చెల్లించాలనే ప్రశ్న ఇప్పుడు పెద్ద టాపిక్ అయ్యింది. అసలు ఉద్యోగులు ఎలా సంతకాలు చేశారనేది అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement