Friday, December 6, 2024

NZB: చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. పలువురు విద్యార్థులకు గాయాలు

భీంగల్ టౌన్, ఏప్రిల్ 8(ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం కారేపల్లి గ్రామం వద్ద భీంగల్ మండల కేంద్రానికి చెందిన కృష్ణవేణి స్కూల్ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానిక గ్రామస్తులు స్పందించి స్కూల్ పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్ బస్సులో సుమారు 90మంది పిల్లలు ప్రయాణం చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు.

స్కూల్ బస్సుకు సుమారు నలభై మంది పరిమితి ఉండగా, పరిమితికి మించి స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్కూల్ బస్సు ఫిట్నెస్ పై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో చాలా స్కూళ్లలో బస్సులకు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement