Friday, May 3, 2024

Breaking | ఎస్సారెస్పీ కాలువలో పడిన దుప్పి.. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘ‌ట‌న‌

పెద్దపల్లి జిల్లాలో ఘోరం జ‌రిగింది. పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు దుప్పి పడిపోయింది. బుధవారం దుప్పి కాలువలో పడిపోయిందని గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కాలువ నుండి దుప్పి బయటికి రాలేక ఇబ్బంది పడుతుండడంతో గ్రామస్తులు దాన్ని బయటకు తీయడంతో ప్రాణాలతో బతికి బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement