Monday, April 29, 2024

90 వేల మందికి ఉపాధి.. తెలంగాణలో పీఎంకేవీ అమలుపై కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) 2.0 కింద తెలంగాణా రాష్ట్రానికి చెందిన 90 వేల మందికి ఉపాధి లభించిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ వెల్లడించింది. పీఎంకేవీవై 1.0 కింద షార్ట్‌ టర్మ్‌ ట్రైనింగ్‌ పొందిన వారిలో 21వేల మందికి ఉపాధి లభించిందని తెలిపింది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, పసునూరి దయాకర్‌లు అడిగిన ప్రశ్నలకు ఆ శాఖా సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పీఎంకేవీవై 2.0 కింద దేశవ్యాప్తంగా 21.01 లక్షల మంది అభ్యర్థులకు ఉపాధి లభించగా, అందులో 90 వేల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement