Tuesday, April 30, 2024

బాసర ట్రిపులో ఐటీలో 73 శాతం అమ్మాయిలే.. వర్సిటీలో నాలుగు ఎకరాల్లో ఎకో పార్కు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం అడ్మిషన్లలో 73 శాతం అమ్మాయిలే ఉన్నారని బాసర ట్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీ ఇంఛార్జీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.వి.వెంకటరమణ తెలిపారు. విద్యార్థులను మోటివేషన్‌ చేసేందుకు త్వరలోనే పలువురు ఐఏఎస్‌ ఉన్నతాధికారులను వర్సిటీకి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడమే కాకుండా జీవితంలో వారు సైతం ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవడానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయన్నారు.

ట్రిపుల్‌ ఐటీ వీసీ వెంకటరమణ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి వివరించారు. వర్సిటీలో నాలుగు ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అటవీ శాఖ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ, ఔషధ మిక్కలతో పాటు వివిధ రకాల మొక్కలతో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌లను అందించేందుకుగానూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు. వర్సిటీ, హాస్టళ్లలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 2న రెండు వేల మందితో ర్యాలీని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం వీసీ డాష్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement