Sunday, May 19, 2024

ఇంటర్‌ సప్లమెంటరీ ఫీజు కట్టిన 3.48 లక్షల మంది విద్యార్థులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 8తో పరీక్ష ఫీజు గడువు ముగిసింది. అయితే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు గానూ మొత్తం 3,48,171 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టారు.

వీరిలో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు 1,34,329 మంది, సెకండ్‌ ఇయర్‌ సప్లమెంటరీ విద్యార్థులు 1,13,267 మంది ఉన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ ఇంప్రూవ్‌మెంట్‌ రాసేవారు 99,667 మంది ఉండగా, సెకండ్‌ ఇయర్‌లో కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. బ్రిడ్జికోర్సుకు చెందిన వారు మరో 893 మంది ఉన్నారు. ఆగస్టు 1 నుంచి పరీక్షలు జరగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement