Monday, April 29, 2024

27న మున్నూరు కాపు ప్లీనరీ … 119 నియోజకవర్గాల నుంచి భారీగా తరలి రావాలని అద్యక్షుడు కొండ దేవయ్య పిలుపు

హైదరాబాద్ – ఈ నెల ఆగస్టు 27 ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార లో మున్నూరు కాపు ప్లీనరీ నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలో కేంద్రాల్లో 119 నియోజకవర్గాల కేంద్రాల్లో ఆయా జిల్లా అధ్యక్షులు బాధ్యులు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు అన్ని మండలాల కార్యవర్గంలు గ్రామ కమిటీ బాధ్యతలను అన్ని మున్నూరు కాపు సంఘం బాధ్యులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కుల పెద్దలందరూ పాల్గొని ఇయొక్క ప్లీనరీని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ పిలుపు ఇచ్చారు .

ఈ సమావేశ ముఖ్య విశేషాలను అయన అయన మీడియాకు వివరిస్తూ, .

తెలంగాణ రాష్ట్రం లో 40 లక్షల మంది మున్నూరు కాపు లు ఉన్నారు వాళ్ళందరూ రైతులుగా రైతు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారులు చేస్తూ జీవన సాగిస్తున్నారు వారి పిల్లలు చదువుల గురించి మరియు పనులు చేసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు మున్నూరు కాపులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలంటే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 5000 కోట్లు రూపాయలు కేటాయించే విధంగా మరియు ప్రతి జిల్లా హెడ్ కోర్టర్ లో ఒక ఎకరం స్థలం రెండు కోట్ల రూపాయలతో మన మున్నూరు కాపు బిడ్డల విద్యార్థులు చదువుకునేందుకు హాస్టల్ల నిర్మాణం కోసం చేసుకోవడానికి ముందుకు సాగాలని ఉద్దేశంతో రాజకీయంగా కూడా దామాషా ప్రకారం మన వాటా మనకు దక్కే విధంగా అన్ని రాజకీయ పార్టీల మున్నూరు కాపులను కలుపుకొని ముందుకు సాగేందుకు ఈ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేసామని వెల్లడించారు.

ఈ సమావేశంలో మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వి మహేందర్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి లత, గ్రేటర్ హైదరాబాద్ సెక్రెటరీ రాజాబాబు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ వాసాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు రమేష్, కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు బాశెట్టి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి తేళ్ల హరికృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల బాలకృష్ణ, స్టేట్ సీనియర్ సిటిజన్స్ జనరల్ సెక్రెటరీ ఆకుల నర్సింగరావు, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ తోట శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement