Sunday, April 28, 2024

కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. 11 గేట్లు ఎత్తివేత

నిర్మల్ జిల్లా కడెం జులై 21 ప్రభా న్యూస్. నిర్మల్ జిల్లాలోని అతి పెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడం జలాశయంలో వేలాది క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా జలాశయంలో ఒక లక్ష 86 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో శుక్రవారం ఉదయం కడం నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుకు చెందిన తొమ్మిది వరద గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి 1,43,000 నీటిని వదిలారు ప్రస్తుతం కడం జలాశయంలో ఒక లక్ష 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695. 500 అడుగులు ఉందని అధికారులు పేర్కొన్నారు కడం జలాశయంలో మరింత ఇన్ ఫ్లో వరద నీరు పెరుగుతే మరిన్ని వరద గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు

కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడం జలాశయంలో లక్షలాది క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో కడెం ప్రాజెక్టు పైనే కడెం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విట్టల్ డి ఈ బోజదాస్ ఉండి ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుదల విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి సమాచారాన్ని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు అందిస్తూ వారి ఆదేశాలను పాటిస్తూ కడెం ప్రాజెక్టు వరద గేట్ల ఎత్తివేత నీటి విడుదలపై విషయంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు చేరినందున కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింది పంట పొలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మొరాయిస్తున్న వరద గేట్లు ఎత్తేతందుకు సిబ్బంది పాట్లు.

నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాదంలో పడింది కడెం ప్రాజెక్టుకు వరద పెరగడంతో ఇన్ ఫ్లో వరద నీరు రావడం తో నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు చెందిన వరద గేట్లు ఎత్తివేసి గోదావరిలోకి నీటిని వదిలారు కాగా ఇందులో ప్రాజెక్టుకు చెందిన ఆరు గేట్లు మోరరాఇ స్తుండడంతో గేట్లు ఎత్తేతందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఒక్కసారిగా అధికారులకు పై తేనెటీగలు దాడి చేశాయి తేనెటీగల దాడిలో ముగ్గురు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు కడెం ప్రాజెక్టు ఇన్ ఫ్లో వరద నీరు భారీగా వస్తుండడంతో అధికారులు ఆందోళన గురవుతున్నారు గత ఏడాది కూడా కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడంలో మో రాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి కడెం ప్రాజెక్టు లో లక్షలాది ఇన్ ఫ్లోవరద నీరు వచ్చి చేరుతుండడంతో ఒకపక్క వరద గేట్లు ఎత్తే ప్రయత్నంలో వరద గేట్లు మురాయించడంతో కడెం ప్రాజెక్టుకు వరద ముప్పు కలుగుతుందని కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement