Saturday, November 2, 2024

YS Sharmila: వడ్లు కేంద్రం చేత కొనిపించడం చాతకాదా ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీఆర్ఎస్ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు.’’ రైతు చచ్చినా మాకు మా రాజకీయాలు కావాలి తప్పితే రైతు బతుకు గురించి ఆలోచించడం లేదు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటాం, అని మొన్నటివరకు చెప్పుకొన్న కేసీఆర్ గారు, కేంద్రంతో పంచాయితీ మొదలవ్వగానే యాసంగి కిరికిరి మొదలుపెట్టి కేంద్రం కొననంటుంది. అందుకే మేము కొనటం లేదని నాటకాలాడుతున్నరు. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, మోడీని తరిమేస్తాం అని చెప్పుకొనే కేసీఆర్ గారు, రైతుల వడ్లు కేంద్రం చేత కొనిపించడం చాతకాదా? మీవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనా? మీకు దమ్ముంటే రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనండి. కేంద్రం మెడలు వంచి కొనిపించండి’’ అని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement