Saturday, May 4, 2024

Happy New Year | పార్టీ మూడ్‌లో యువత.. 2024కి గ్రాండ్‌ వెల్‌కమ్‌!

కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్​ సిటీ పటాకుల మొతతో దద్దరిల్లిపోతోంది. న్యూ ఇయర్​ వేడుకలను యూత్​ సంబురంగా జరుపుకుంటున్నారు. 2023కి గుడ్ బై చెప్పి.. 2024కి ఘన స్వాగతం పలికారు. భవిష్యత్తుపై కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. గెట్ రెడీ అంటున్నారు.  ఏడాది మొత్తం గుర్తుండేలా కొత్త సంవత్సర వేడుకలకు చేసుకుంటున్నారు. ఆనందోత్సవాల మధ్య కేరింతలతో 2024కి గ్రాండ్‌ వెల్‌కమ్ చెబుతూ పార్టీ మూడ్​ ఎంజాయ్​ చేస్తున్నారు. పట్నం, పల్లె అని తేడా లేకుండా.. అంతా పార్టీ మూడ్‌లో ఉన్నారు. న భూతో న భవిష్యత్​ అనేలా సెలబ్రేషన్స్‌తో హంగామా చేస్తున్నారు. ఈసారి న్యూ ఇయర్​ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది.


సెలబ్రేషన్స్ అంటే.. ఏడాదంతా గుర్త్తుండి పోవాలని.. 2024 మొత్తం స్వీట్ మెమోరిస్‌లా మిగిలిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. దీని కోసం ముందే గెస్ట్ హౌస్​లు, రిసార్టులు బుక్ చేసుకుని పార్టీ ఎంజాయ్​ చేస్తున్నారు. అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్లబ్‌లు, స్టార్‌ హోటల్స్‌, కన్వెన్షన్లలో సెలబ్రేషన్స్​కు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలు నిర్వహించుకుంటున్నారు.  ప్రముఖులు, వ్యాపార వర్గాలు గోవాలో, విదేశాల్లో న్యూ ఇయర్ పార్టీలను ఎంజాయ్​ చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement