Sunday, April 28, 2024

టీ ష‌ర్ట్.. ట‌వ‌ల్ తో మెట్రో ట్రైన్ ఎక్కిన యువ‌కుడు.. అవాక్క‌యిన ప్ర‌యాణికులు..

పిచ్చి ప‌లు ర‌కాలు..ఎవ‌రి ఇష్టం వారిదే అన్న‌ట్లు..ఇక్క‌డో యువ‌కుడు పసుపు రంగు టవల్ నడుముకు చుట్టుకుని తెలుపు రంగు టీషర్ట్ వేసుకుని నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చినట్టుగా ఢిల్లీ మెట్రో ట్రైన్ ఎక్కేశాడు. చాలా క్యాజువల్‌గా మెట్రో ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లలో టవల్ పై తిరిగాడు. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని కొన్ని సార్లు అద్దాల వైపు చూసుకుంటూ జుట్టు సరి చేసుకుంటున్నట్టు చేశాడు. అందరూ రెడీ అయిపోయి ఆఫీసులకు వెళ్లుతున్నట్టుగా ఉన్న ప్రయాణికులు అతడిని ఆ లేజీ డ్రెస్‌లో చూసి షాక్ అయ్యారు. కొందరైతే నవ్వు ఆపుకోలేకుండా ఉండలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మోహిత్ గౌహర్ అనే యూజర్ పోస్టు చేశాడు. ‘ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాయి. ఈ రోజు నేను ఆఫీసులోనే స్నానం చేసుకుంటా’ అనే క్యాప్షన్‌తో ఆ యువకుడు పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ యువకుడి కాన్ఫిడెన్స్‌ను ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement