Wednesday, October 16, 2024

యూపీకి రాజైనా అమ్మకి కొడుకే.. తల్లి ఆశీర్వాదం తీసుకున్న యూపీ సీఎం యోగి

మాతృదేవోభవ అంటూ అమ్మకు అగ్ర తాంబూలం ఇచ్చిన సంస్కృతి మనది. ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అంటారు. కుమారుడు ప్రయోజకుడైతే తల్లిదండ్రుల మనసులు ఆనందంతో ఉప్పొంగిపోతాయి. ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చూసిన ఆయన మాతృమూర్తి కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అమ్మ దీవెనలతో యోగి కూడా ఆనందంతో పొంగిపోయారు. ఈ అరుదైన దృశ్యం మంగళవారం ఉత్తరాఖండ్ లోని పౌరీలో చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం తర్వాత యోగి.. తన సొంతూరులో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అమ్మ పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. యోగి మేనల్లుడికి పుట్టు వెంట్రుకల వేడుక బుధవారం ఉండడంతో సొంతూరికి చేరుకున్నారు. 

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 2020 ఏప్రిల్ లో కన్నతండ్రి అంత్యక్రియలకు సీఎం యోగి వెళ్లలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు అందరికీ తండ్రిగా కోవిడ్ నిబంధనల విషయంలో మార్గదర్శిగా ఉండాల్సిన తానే, వాటిని ఉల్లంఘిస్తే ఎలా అంటూ ఆయన ఆ సందర్భంలో విమర్శకులను ప్రశ్నించారు. కాగా, ప్రధాని మోదీ మాదిరే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కుటుంబానికి దూరంగా ఉంటుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement