Thursday, September 12, 2024

Hyd: జంట హత్యల కేసులో పురోగతి : భర్తే హంతకుడు

హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెంట్ లో జరిగిన జంట హత్యల కేసులో పురోగతి సాధించారు పోలీసులు. భర్త శ్రీనివాసరావే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతితో యశ్వంత్ కు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని.. అందుకు భర్తే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ లో నిన్న బయటపడ్డ జంట హత్య కేసులో పురోగతి లభించింది. జ్యోతి భర్త శ్రీనివాస రావు ఈ హత్యలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. జ్యోతికి గత కొంతకాలంగా యశ్వంత్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ రావు జ్యోతితో పాటు, యశ్వంత్‌లను హత్య చేశాడు. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement