Thursday, May 2, 2024

య‌శోద‌గా స‌మంత – మే 5న ఫ‌స్ట్ గ్లింప్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం య‌శోద‌. ఈ చిత్రాన్ని హ‌రి అండ్ హ‌రీశ్ డైరెక్ష‌న్ లో రూపొందిస్తున్నారు..ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ ని మే5న రిలీజ్ చేయ‌నున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ నెల 5వ తేదీన .. ఉదయం 11:07 నిమిషాలకు ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశార‌ట‌. ఇతర ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్ .. సంపత్ రాజ్ .. మురళీ శర్మ .. ఉన్ని ముకుందన్ కనిపించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మ‌రి ఈ చిత్రం స‌మంత‌కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందించ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement