Monday, April 29, 2024

Omicron: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు

భారత్ లో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ బాధితులు పెరుగుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల అమలుచేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోనూ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆక్షంలు విధించింది.

దేశంలో మిగత రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే ఎక్కువ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ 57 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో ఓమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం.. క్రిస్మస్, నూతన  సంవత్సరం వేడుకలను జరుపుకోవడాన్ని నిషేధించింది.

న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల్లో ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బహిరంగ వేడుకలపై నిషేధం విధించింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మతపరమైన పండుగలకు సంబంధిత సమావేశాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేదం విధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement