Monday, April 29, 2024

Wrestlers : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు భేటీ

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర స్పోర్ట్స్ మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసానికి పలువురు రెజ్లర్లు చేరుకున్నారు. నిరసన చేస్తున్న రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అనుగార్ ఠాకూర్ ప్రకటించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆందోళనకు దిగారు. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు ఈ ఏడాది జనవరి నుండి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

విపక్ష పార్టీలు కూడా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. రైతు సంఘాల నాయకుడు రాకేష్ తికాయత్ కూడా మహిళా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. రెండు రోజుల క్రితం మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా తదితరులు విధుల్లో చేరారు. అయితే ఉద్యమాన్ని నిలిపివేశారని ప్రచారం సాగింది. రైల్వేలో తాము విధుల్లో చేరినా కూడా తమ ఆందోళనలను కొనసాగిస్తామని మహిళా రెజర్లు ప్రకటించారు. అయితే తనతో చర్చించడానికి రావాలని వారిని అనురాగ్ ఠాకూర్ ఆహ్వానించడంతో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చల ద్వారా అయినా రెజ్లర్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement