Sunday, May 5, 2024

గుంటూరు కారం.. హైద‌రాబాద్ లో నెల‌రోజుల షూటింగ్

హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో గుంటూరు కారం చిత్రం షూటింగ్ నెల‌రోజులు జ‌ర‌గ‌న‌నుంద‌ట‌. ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరగనున్నట్లు సమాచారం. ఈ మేజర్ షెడ్యూల్లో స్టార్ హీరో మహేష్ బాబు, హీరోయిన్స్ పూజా హెగ్డే, శ్రీలీలతో సహా ప్రధాన తారాగణంపై సీన్స్ చిత్రీకరించనున్నారట. యాక్షన్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్.చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్నాడు.వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement