Sunday, May 5, 2024

ప్రాణాల‌తో తిరిగి వ‌చ్చా – పంజాబ్ సీఎం కి థ్యాంక్స్ – ప్ర‌ధాని మోడీ

పంజాబ్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రోడ్డు మార్గంలో వెళుతున్న క్ర‌మంలో హుస్సేనివాలాలోని జాతీయ అమ‌ర‌వీరుల స్మార‌కానికి 30కిలో మీట‌ర్ల దూరంలో ప్ర‌ధాన మంత్రి కాన్వాయ్ ని నిర‌స‌న కారులు అడ్డుకున్నారు. దాంతో 15నుంచి 20నిమిషాల‌వ‌ర‌కు ప్లై ఓవ‌ర్ పైనే చిక్కుకుపోయారు ప్ర‌ధాని. దాంతో పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోడీ పర్యటనకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రధాని మంత్రి పర్యటన ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉన్నా… సరైన ఏర్పాట్లు చేయలేదని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. భద్రతా వైఫల్యాలతో ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం నుంచి అర్థాంతరంగా బాటిండా ఏయిర్ పోర్ట్ కు తిరిగి వచ్చిన క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ప్రాణాలతో ఏయిర్ పోర్టుకు తిరిగి రాగలిగాను.. మీ సీఎంకు థాంక్స్ చెప్పండి’’ అంటూ.. అక్కడ ఉన్న అధికారులతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మోడీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement