Friday, April 26, 2024

మిర్చి రైతులకు నష్టపరిహారం అందజేయాలి : భూర్క వెంకటన్న

కొత్తగూడ : మిర్చి రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయాల‌ని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు భూర్క వెంకటన్న కోరారు. మండల కేంద్రంలో సాగు చేస్తున్న మిర్చి పంటలు ఎండిపోయి కాత, పూత లేకుండా నష్టపోతున్న రైతుల సమస్యపై అఖిల భారత రైతు కూలీ సంఘం, ఎ.ఐ.కె.ఎమ్.ఎస్ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంక‌ట‌న్న‌ మాట్లాడుతూ… మిర్చి తోటలకు తామరపురుగు, నల్లి దోమ వైరస్ లతో మిర్చి సాగు రైతులు నష్టపోతూ మిర్చికి కాత పూత లేక రైతులు గుండె ధైర్యం కోల్పోయి, మనోవేదనకు గురైన మిర్చి రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కూడా
రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తు చోద్యం చూస్తుంద‌న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఎ.ఐ.కె.ఎమ్.ఎస్.ఆధ్వర్యంలో దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారమ‌న్నారు. అనంతరం స్థానిక తహసిల్దార్ చందా నరేష్ కు డిమాండ్స్ తో కూడిన మెమోరాండన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎ.ఐ.కె.ఎమ్.ఎస్.జిల్లా నాయకులు గుగులోతు హచ్య నాయక్, మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి యుగేందర్, మండల నాయకులు చిట్టబోయిన రామచంద్ర, జాడి సారయ్య, గుగులోతు లాలు, పి.డి.ఎస్.యు.జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement