Friday, May 17, 2024

రష్యా ఎందుకు ఉక్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుంది?

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య భీగర యుద్ధం జ‌రుగుతోంది. ఉక్రెయిన్‌లో ఇప్ప‌టికే వంద‌లాది మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అసలు ఈ యుద్ధం జరగడానికి కారణం ఏమిటి?

ఉక్రెయిన్ ఎప్పుడూ పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగానే ఉందని, అది ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేనే లేదని రష్యా చెబుతోంది. నాటోలో ఉక్రెయిన్ చేరదని పాశ్చాత్య ప్రపంచం తనకు హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ అటు రష్యాతోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోనూ సరిహద్దును పంచుకుంటోంది. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన ఉక్రెయిన్‌కు రష్యా సామాజిక, సాంస్కృతిక జీవనంతో దగ్గరి అనుబంధం ఉంది. ఆ దేశంలో రష్యన్ భాషను మాట్లాడే వాళ్లు అత్యధికంగా ఉంటారు. అయితే, 2014లో రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.

రష్యా, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మధ్య మిన్స్క్‌ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకూడదని, రష్యా అనుకూల వేర్పాటువాద ప్రాంతం డాన్‌బాస్‌ నుంచి రష్యన్‌ దళాల ఉపసంహరించుకోవాలని ఉంది. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని రష్యా కోరుతోంది. అయితే, ఉక్రెయిన్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీంతో అసలు వివాదం మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement