Friday, May 3, 2024

Coins: నదుల్లో కాయిన్స్​ ఎందుకు వేస్తారు.. అట్లా వేయ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుంది? (video)

పుణ్యక్షేత్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులో కానీ, వాగులు, నదులు, సముద్రం వంటి ప్రదేశాల్లో కాయిన్స్​ వేయడం చూసే ఉంటారు. మరి అలా ఎందుకు వేస్తారన్న ప్రశ్న కూడా వచ్చే ఉంటుంది. దీనికి చాలా కారణాలున్నాయంటున్నారు పెద్దలు. అంతేకాకుండా దేవుడి గుడి దగ్గర చాలా మంది స్నానాలు చేసి పూజలు చేస్తారు. అక్కడ కొంత మంది గంగలో నాణేలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు వేస్తారనే విషయం చాలా మందికి తెలవదు. అంతేకాదు నదులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ సందర్భంగా నదుల్లో లేదా సరస్సులలో నాణేలను కూడా వేస్తుంటారు. నదులను ఎందుకు పూజిస్తారు? ఇలా నదుల్లో నాణేలు వేయడానికి గల కారణాలేంటి? దేవుని దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి కచ్చితంగా వేయాలా అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జర్నీ చేసేటప్పుడు బ్రిడ్జి పై నుంచి నదిలోకి కొంత మంది నాణేలను విసురుతూ ఉంటారు. అంతేకాదు నదులను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలను వేస్తుంటారు. దీనికి గల కారణం ఏంటంటే.. అప్పట్లో రాగి (కాపర్​) నాణేలను ఎక్కువగా ఉపయోగించేవారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని నమ్మకం.

అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు. అప్పటి రాజ్యంలో ఉండే వారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. ఎందుకంటే రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. నది శుభ్రమవుతుందని.. రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగేందుకు పనికొస్తుందని ఆ పనిని చేసేవారు.

ఇక.. అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్లనే తాగేవారు. ఇప్పటిమాదిరిగా ఫిల్టర్లు కానీ, ఫిల్టర్​ వాటర్​ బాటిల్స్​ కానీ ఉండేది కాదు. అందుకే రాగి నాణేలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అందుకే దీని వల్ల ఉపయోగం ఏంటనే విషయం కూడా చాలా మందికి తెలియకుండానే ఆచరంగా వస్తోంది. దీన్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం రాగి నాణేలన్నీ కనుమరుగు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. పైగా ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఈ వీడియో కోసం www.prabhanews.comలో చూడొచ్చు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement