Tuesday, April 16, 2024

‘ఆర్ఆర్ఆర్’ ఈవెంట్ కి రానున్న హాలీవుడ్ స్టార్ ఎవ‌రంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మల్టీస్టారర్ సినిమా “ఆర్ఆర్ఆర్”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సింది.. కానీ, ఈ చిత్రాన్ని మార్చ్ 25కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో బిజీగా ఉంది మూవీ యూనిట్. కాగా, త్వరలోనే ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ని భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ కాదు దుబాయ్ లో జరగబోతోంద‌ని, ఈ ఈవెంట్ కి ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్ వంటి హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టామ్ క్రూజ్ ను పిలిచి సినిమాకి మరింత హైప్ ను పెంచబోతున్నరు దర్శక నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement